నాజూకు వయ్యారాలతో ఫిదా చేస్తున్న ఢిల్లీ భామ!!

సౌత్ సినీ ఇండస్ట్రీలను కొన్నేళ్ల పాటు తన అందాలతో ఏలిన హీరోయిన్ శ్రియ. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ.. తెలుగు తమిళ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రస్తుతం వైవాహిక జీవితం ఆస్వాదిస్తుంది. డెహ్రాడూన్ లో పుట్టి హరిద్వార్ లో పెరిగింది శ్రియ. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తిచేసి.. అక్కడే లేడీ శ్రీరామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆర్ట్స్ పట్టా పొందింది. చిన్నప్పటి నుండే శ్రియ కథక్ డాన్స్ నేర్చుకున్న ఈ భామ.. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే ఓ వీడియో షూట్లో పాల్గొందట. ఇక 2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని తెలుగులో మోస్ట్ బిజీ హీరోయిన్ అయింది అమ్మడు. ఇక తుఝే మేరీ కసం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శ్రియ. అంతేగాక తమిళ కన్నడ మలయాళం సినిమాలలో కూడా ఈ భామ తన సత్తా చాటింది.

ఇక పెళ్ళైనా కూడా సినిమాలకు గుడ్ బై చెప్పకుండా.. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. కరోనా మహమ్మారి వలన సినీతారలంతా ఇంటికే పరిమితం అయ్యారు. పెళ్లైనా ఈ భామ అందాల ఆరబోత మాత్రం తగ్గించట్లేదు. సోషల్ మీడియాలో క్రేజ్ అంతా క్యాచ్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులకు తన లేటెస్ట్ ఫోటోలతో అలరిస్తుంది. అమ్మడి పోస్ట్ కోసం మిలియన్ల అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా శ్రియ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దగ్గర పడుతున్నా.. ఈ ఢిల్లీ సోయగాలతో అలరిస్తూనే ఉంది. నీలి రంగు దుస్తులలో తన అందాల వల విసిరింది. ఇంకేముంది ఫ్యాన్స్ అంతా అలా ఫిదా అయిపోతున్నారు. అమ్మడి నాజూకు వయ్యారాలు.. ఆ నవ్వు ఇంకా అలాగే ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
× RELATED షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇంకా హైదరాబాద్ లోనే రకుల్
×