మహేష్ ఫ్యాన్స్ మరో రికార్డ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెండు వారాల క్రితం ట్విట్టర్ లో 3.1 కోట్ల ట్వీట్స్ తో ఆల్ ఇండియా రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే. 24 గంటల వ్యవధిలో ఏ ఒక్క హ్యాష్ ట్యాగ్ కూడా ఇండియాలో ఇప్పటి వరకు ఆ స్థాయిలో ట్రెండ్ అయ్యింది లేదు. అంతకు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు పవన్ ఫ్యాన్స్ రెండు కోట్లకు పైగా ట్వీట్స్ చేశారు. అయితే ఆ రికార్డును మూడు కోట్లతో చెరిపేశారు. ఇక రేపు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో మళ్లీ ఫ్యాన్స్ సందడి మొదలయ్యింది.

పుట్టిన రోజుకు ముందు రోజు అయిన నేడు సాయంత్రం ఆరు గంటలకు హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెడ్డింగ్ ప్రారంభం అయ్యింది. కేవలం 9 నిమిషాల్లో మిలియన్ కు పైగా ట్వీట్స్ పడ్డాయి. ఇక 20 నిమిషాల్లో 2.1 మిలియన్ ల ట్వీట్స్ వేశారు. 10 మిలియన్ ల వ్యూస్ కు కేవలం గంటన్నర సమయం మాత్రమే తీసుకున్నారు. నాలుగు గంటల వ్యవధిలో దాదాపుగా 15 మిలియన్ల ట్వీట్స్ ను మహేష్ బాబు ఫ్యాన్స్ చేశారు.

ఈ లెక్కన చూస్తుంటే 24 గంటల వ్యవధిలో సునాయాసంగా పాత రికార్డు బద్దలు అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. 3.5 కోట్ల సరికొత్త రికార్డు ట్వీట్స్ ను మహేష్ బాబు ఫ్యాన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉంది కనుక పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ భారీ టార్గెట్ ను సెట్ చేసేలా ఉన్నారు. ఈ సందడి చూస్తుంటే మామూలుగా లేదు.
× RELATED మాట నిలబెట్టుకొని రియల్ హీరో అనిపించుకున్న మెగా హీరో...!
×