నిన్న చిరంజీవి నేడు మహేష్ బాబు ఫ్యాన్స్ కు రిక్వెస్ట్

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం ఒక వేల కరోనా సోకితే ప్రాణాలతో బయట పడేందుకు ప్రయత్నించడం. ఈ రెండు తప్ప మన వద్ద మరే మార్గం లేదు. కరోనా సోకిన వారికి ప్లాస్మాతో చికిత్స చేస్తే చాలా స్పీడ్ గా క్యూర్ అవుతున్నారు అంటూ మెడికల్ గా నిరూపితం అయ్యింది. అందుకే కరోనాను జయించిన వారు ప్లాస్మా ఇవ్వాలంటూ ప్రముఖులు చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్మా ఇచ్చి కరోనా పేషంట్స్ ప్రాణాలు కాపాడాలంటూ ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చారు.

కొన్ని రోజుల ముందు ట్విట్టర్ లో చిరంజీవి ప్లాస్మా దానం గురించి అభిమానులకు అవగాహణ కల్పించడంతో పాటు కరోనాను జయించిన ప్రతి ఒక్కరు కూడా ప్లాస్మా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. నిన్న ఏకంగా సీపీ సజ్జనార్ తో కలిసి మీడియా ముందుకు వచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఇప్పుడు అదే దారిలో మహేష్ బాబు కూడా వచ్చారు. తన అభిమానుల్లో ఎవరైతే కరోనాను జయించారో వారు అంతా కూడా ప్లాస్మా దానంకు ముందుకు రావాలంటూ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు.

మహేష్ బాబు ట్వీట్ చేయడంతో పాటు తనవంతుగా మీడియా ముందుకు కూడా వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్స్ ప్లాస్మా దానం గురించి అవగాహణ కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయం. వీరిద్దరు కాకుండా ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు ఇంకా పలువురు యంగ్ స్టార్స్ ప్లాస్మా దానం గురించి మాట్లాడారు.
× RELATED షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇంకా హైదరాబాద్ లోనే రకుల్
×