కుర్ర గుండెలను మీటుతున్న తెలుగు వయ్యారం!!

తెలుగు తెరపై కుర్ర భామలు గ్లామర్ షో చేయడంలో అసలు వెనుకాడటం లేదు. వారిలో తెలుగమ్మాయి తేజస్వి మడివాడ కూడా ఒకరు. మొన్నటి వరకు ఇండస్ట్రీలో కొందరు మాత్రమే తెలుగు బ్యూటీలు ఉండగా.. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల నుండి హీరోయిన్లు వెలుగులోకి వస్తున్నారు. హీరోయిన్లుగా కనిపించాల్సిన తెలుగు భామలు అంతా సెకండ్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఒకవేళ మెయిన్ హీరోయిన్లుగా మెరిసినా అవకాశాలు తక్కువ. ప్రస్తుతం తెలుగులో తేజస్వి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు పరభాషా హీరోయిన్లను మించిపోయేలా తన అందాలను ఆరబోస్తుంది. అయితే నటిగా కంటే బిగ్ బాస్ రియాలిటీ షో బ్యూటీగా ఎక్కువ పాపులర్ తెచ్చుకుంది తేజస్వి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి..

స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘ఐస్ క్రీమ్’ సినిమాతో మెయిన్ హీరోయినుగా మారింది. ఇప్పటి వరకు చాలా సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు మాత్రమే చేసింది. ఇప్పటి వరకు 'ఐస్ క్రీం' ఒకటే సోలో హీరోయినుగా చేసిన సినిమా. ఇక బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ అవకాశం రాగానే టీవీ ప్రేక్షకులందరికి దగ్గరైంది. బిగ్ బాస్ షోలో వివాదాలతో పాటు కాస్త గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. అమ్మడు బిగ్ బాస్ నుండి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుండి సినిమా అవకాశాలు కరువు. కానీ అవేం పట్టించుకోకుండా సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది ఈ తెలుగు భామ. కుర్రకారులో వేడి పుట్టించే ఫోటోలు పోస్ట్ చేసింది. రంగు పూల దుస్తులలో అమ్మడు అందాలన్నీ కుర్ర ఎదలను గిల్లుస్తున్నాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి పోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
× RELATED ఇదేం దిక్కుమాలిన బర్త్ డే కేక్ నియా
×