మహేష్ బర్త్ డే సందర్భంగా 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్...!

సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ మహేష్ బాబు బర్త్ డే ట్వీట్స్‌ తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మహేష్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. మహేష్ బాబు - పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' మూవీ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 9 గంటల 09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఈ బర్త్ డే కానుక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా సామూహిక వేడుకలు జరుపుకోవద్దని.. ప్ర‌స్తుతం క‌రోనాతో మ‌నమంద‌రం చేస్తున్న యుద్ధంలో సుర‌క్షితంగా ఉండ‌డం అన్నింటిక‌న్నా ముఖ్యమని.. నా పుట్టినరోజున అభిమానులంతా వేడుక‌లకి దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని మహేష్ బాబు కోరాడు. దీంతో డిజిటల్ మాద్యమాలైన ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్ పేజీల్లో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ట్విట్టర్ లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

× RELATED పాన్ ఇండియా స్టార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?
×