రానా నీకు ఇదే ఫైనల్ జాలీడే!


టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా నేడు రాత్రి మిహీక బజాజ్ ను వివాహం చేసుకోబోతున్నాడు. వీళ్ల ప్రేమ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఇరు కుటుంబాల పెద్దలు మరియు అక్కినేని ఫ్యామిలీకి చెందిన కొందరు హాజరు కాబోతున్న రానా పెళ్లి వేడుక గురించి సోషల్ మీడియాలో కూడా తెగ చర్చ జరుగుతోంది. రానా పెళ్లికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు తనకు ఇతరుల నుండి వచ్చిన విషెష్ను కూడా స్టోరీ రూపంలో షేర్ చేస్తున్నాడు.

రానా పెళ్లి సందర్బంగా హీరో నవదీప్ వింతగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ విషయాన్ని రానా షేర్ చేశాడు. కని విని ఎరుగని లాస్ట్ జాలీడే ఇది నీకు. బెస్ట్ విషెష్ తెలుపుతున్నా మైడియర్ ఫ్రెండ్ అంటూ నవదీప్ ఫన్నీ కామెంట్ పోస్ట్ చేశాడు. నీ జాలీ లైఫ్ పెళ్లితో ఎండ్ అవుతుంది అంటూ ఇండైరెక్ట్ గా రానాను నవదీప్ హెచ్చరించాడు. దాన్ని రానా షేర్ చేశాడు. చాలా మంది కూడా ఇన్నాళ్ల నీ బ్యాచిలర్ లైఫ్కు ఎండ్ కాబోతుంది. అందుకు చాలా బాధగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు నవదీప్ అన్నట్లుగానే ఇకపై నీ జీవితంలో జాలీ డేస్ అయిపోయాయి అంటూ సరదా కామెంట్స్ చేశారు.

గత మూడు రోజులుగా పెళ్లికి సంబంధించిన హంగామా కనిపిస్తుంది. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిధులను ఆహ్వానించారు. పెళ్లి పేరుతో అనారోగ్యంను అందరికి అంటించాలనుకోవడం లేదు అంటూ సురేష్ బాబు అన్నారు. అన్నట్లుగానే ఇండస్ట్రీలో ఏ ఒక్కరికి కూడా ఆహ్వానం పంపలేదు. ఇటీవల నితిన్ వివాహంకు ప్రముఖులను ఆహ్వానించారు. కాని రానా పెళ్లికి ఏ ఒక్కరు కూడా లేరు. అతిథులు లేకుండా అంగరంగ వైభవంగా రానా వివాహం జరుగుతోంది.
× RELATED షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇంకా హైదరాబాద్ లోనే రకుల్
×