మా అమ్మాయి ఎప్పుడూ ప్రెగ్నెంట్ అవ్వలేదు

సుశాంత్ మృతి కేసుకు ఆయన మాజీ మేనేజర్ దిశ సలియాన్ ఆత్మహత్యకు ఏదో సంబంధం ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె బిల్డింగ్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య కేసులో సుశాంత్ ను కూడా విచారించారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనేక వార్తలు పుకార్లు మీడియాలో వచ్చాయి. అందుకే సుశాంత్ చనిపోయే ముందు కూడా దిశా సలియాన్ పేరును గూగుల్ లో సెర్చ్ చేశాడు అంటున్నారు. ఇదే సమయంలో ఆమె గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దిశ సలియాన్ ప్రెగ్నెంట్ అయ్యిందని ఆమెపై కొందరు అఘాయిత్యం చేశారంటూ కూడా ప్రచారం జరిగింది. సుశాంత్ మృతి చెందినప్పటి నుండి ఆ ప్రచారం మరింత ఎక్కువ అయ్యింది. దాంతో దిశ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. తమ కూతురు మృతి చెందిన తర్వాత ఇలాంటి ప్రచారాలు చేయడం భావ్యం కాదు. ఆమె చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా గర్బం దాల్చలేదు అంటూ క్లీయర్ గా ఇచ్చారు.

ఇక ఆమెపై అఘాయిత్యం జరిగినట్లుగా జరుగుతున్న ప్రచారం కూడా నిజం కాదని దిశ తల్లి తేల్చి చెప్పింది. దిశకు చెడ్డ పేరు తీసుకు వచ్చేలా ఎవరు వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని మళ్లీ ఇలాంటివి పునరావృతం అయితే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్దం అవుతామంటూ హెచ్చరించింది. సుశాంత్ మృతి కేసు సీబీఐ వద్దకు చేరింది. కనుక ఇప్పుడు దిశ ఆత్మహత్య విషయమై వారు ఎంక్వౌరీ చేసే అవకాశం ఉందంటున్నారు.
× RELATED పాన్ ఇండియా స్టార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?
×