అల దుబాయిలో డేవిడ్ రఫ్పాడిస్తాడా?

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలవడంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచిన విషయం తెల్సిందే. నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న అల వైకుంఠపురంలోని పాటలు ఏ స్థాయిలో ఫేమస్ అయ్యాయో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుట్టబొమ్మ పాట ఖండాంతరాలు దాటేసింది. టిక్ టాక్ లో ఆమద్య హల్ చల్ చేసిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ త్వరలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ కు రెడీ అవ్వబోతున్నాడు.

ఈ సందర్బంగా గణేష్ అనే అభిమాని సరదాగా అల వైకుంఠపురం థీమ్ పోస్టర్ ను మార్ఫింగ్ చేశాడు. బన్నీ ఫేస్ మార్ఫింగ్ చేసి డేవిడ్ వార్నర్ ఫేస్ పెట్టాడు. చేతిలో కత్తికి బదులుగా బ్యాట్ పెట్టాడు. ఇక చేతిలో కోడిని అలాగే ఉంచేశాడు. చాలా నాచురల్ గా ఉన్న ఆ పోస్ట్ ను చూసి డేవిడ్ వార్నర్ కూడా ముచ్చట పడ్డట్లున్నాడు.

ట్విట్టర్ లో ఆ పోస్టర్ ను రీ ట్వీట్ చేసి స్మైల్ ఈమోజీలు పోస్ట్ చేశాడు. ఆ పోస్టర్ పై అల దుబాయిలో అంటూ కామెంట్ పెట్టడంతో ఐపీఎల్ కు డేవిడ్ రెడీ అవుతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే డేవిడ్ వార్నర్ ఈసారి ఈ పోస్టర్ ను ట్రెండ్ అయ్యేలా ట్వీట్ చేశాడు.
× RELATED పాన్ ఇండియా స్టార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?
×