యూట్యూబ్ స్టార్ తో టీంఇండియా స్టార్ నిశ్చితార్థం

టీం ఇండియా యువ క్రికెట్ సంచలనం యుజ్వేంద్ర చాహల్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. ఆయన టీం ఇండియా ఆటగాళ్లతో సరదాగా సందడి చేస్తూ ఎప్పుడు మీడియాలో ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు తన పెళ్లి విషయమై మీడియా ముందుకు వచ్చాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో క్రికెట్ కు దూరంగా ఉంటున్న టీం ఇండియా క్రికెటర్లు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు క్రికెట్ అంటూ బిజీగా ఉండే క్రికెటర్లు కొత్త అనుభూతులను పంచుకుంటున్నారు. తాజాగా చాహల్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యాడు.

యూట్యూబ్ లో తన వీడియోలతో బాగా ఫేమస్ అయిన ధనశ్రీతో చాహల్ నిశ్చితార్థం అయ్యింది. కొరియోగ్రాఫర్ కూడా అయిన ధనశ్రీతో చాహల్ కు కొంత కాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి రెడీ అయినట్లుగా వారు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టారు. నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థపు ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. వచ్చే నెలలో యూఏఈలో ఐపీఎల్ ఆడనున్న చాహల్ వచ్చే ఏడాదిలో ధనశ్రీని వివాహం చేసుకునే అవకాశం ఉందంటున్నారు.
× RELATED పాన్ ఇండియా స్టార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?
×