దర్శకేంద్రుడి మాజీ కోడలు మళ్లీ పెళ్లికి రెడీ?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కొన్ని సంవత్సరాల క్రితం రచయిత కనికను వివాహం చేసుకున్నాడు. వీరి సంసార జీవితం కొన్నాళ్ల పాటు సాఫీగా సాగినా ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు శృతి మించక ముందే ఇద్దరు మాట్లాడుకుని కూల్ గా విడాకులు తీసుకున్నారు. ఎలాంటి గొడవ హడావుడి లేకుండా విడిపోవడంతో పెద్దగా మీడియాలో కూడా వార్తలు రాలేదు. ప్రకాష్ నుండి విడిపోయిన కనిక కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్న కనిక మరో రచయిత అయిన హిమాన్షు శర్మతో రిలేషన్ షిప్ మొదలు పెట్టినట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ వెబ్ మీడియా సంస్థ ఒకటి వీరి రిలేషన్ షిప్ గురించి అధికారికంగా క్లారిటీ ఇస్తూ కథనం రాయడం జరిగింది.

ప్రస్తుతం వీరిద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వారి వారి సన్నిహితులు కూడా అనఫిషియల్ గా చెబుతున్నారు. మరో వైపు ఆమద్య ప్రకాష్ కోవెలమూడి వివాహానికి సంబంధించిన విషయమై కూడా వార్తలు వచ్చాయి. మరి ఆ విషయంపై క్లారిటీ రాకపోవడంతో కొన్ని రోజుల తర్వాత ఆ వార్తల గురించి జనాలు మీడియా వారు పట్టించుకోవడం మానేశారు.
× RELATED శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు.. మరో ముగ్గురు సెలబ్రిటీలకు నోటీసులు
×