ఫొటోటాక్ : 'సాహో' ఆంటీ బికినీ ట్రీట్

హీరోయిన్ గానే కాకుండా బుల్లి తెరపై పు షోలను నిర్వహించి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న నటి కమ్ టీవీ స్టార్ మందిరా బేడీ అయిదు పదుల వయసుకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే తక్కువ ఉంది. ఈ సమయంలో కూడా ఈమె బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈమె ఫొటోలు చూసిన కుర్ర కారు ఈ వయసులోనే ఇలా ఉందంటే పాతిక ఏళ్ల క్రితం ఎలా ఉంటుందో కదా అంటూ ఈమె పాత సినిమాలు మరియు వీడియోలను నెట్టింట వెదికేందుకు ప్రయత్నిస్తున్నారట.

సాహోతో సౌత్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మందిరా బేడీ సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయినా కూడా ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. ఇటీవల ఈమె పోస్ట్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఆమె స్విమ్మింగ్ పూల్ లో ఉండి ఫొటోకు ఫోజ్ ఇచ్చింది.

ఈ వయసులో కూడా బికినీ ఫొటోలు షేర్ చేస్తున్నారు అంటే ఇంకా మీకు సినిమాలపై ఆసక్తి తగ్గలేదా లేదంటే మీరు ఇంకా అందంగా ఉన్నాను అని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ లో సినిమాల కంటే బుల్లి తెరపై ఎక్కువగా కనిపించిన మందిరా ఇప్పుడు సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఇలా కాస్త ఎక్కువ ఘాటుగా ఉన్న ఫొటోలను షేర్ చేస్తోంది. మరి ఈ ఫొటోలతో ఆమె ఆశయం నెరవేరేనో చూడాలి.
× RELATED పాన్ ఇండియా స్టార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?
×