సుశాంత్ : ఇంతకు ఆ దీపేష్ ఎక్కడ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పూత్ మృతి తర్వాత పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియా పై సీబీఐ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆ అనుమానాలు మరింతగా పెరిగాయి. సుశాంత్ మరణం తర్వాత ఎంతో మంది మీడియా ముందుకు వచ్చి సుశాంత్ తో తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం సుశాంత్ వద్ద వర్క్ చేసిన వారు కూడా ఇప్పుడు ఫేమస్ అవ్వాలనో లేదంటే మరేదో కారణం వల్ల మీడియా ముందుకు వస్తున్నారు. కాని సుశాంత్ స్నేహితుడు అతడితో ఘటన జరిగిన రోజు వరకు ఉన్న దీపేష్ మాత్రం మౌనంగా ఉన్నాడు.

పోలీసుల విచారణలో తెలిసిన సమాచారం ప్రకారం సుశాంత్ మృతికి కొన్ని గంటల ముందు వరకు కూడా దీపేష్ అతడితో ఉన్నాడు. ఇలాంటి సమయంలో దీపేష్ ను విచారించడం చాలా కీలకం. కాని గత కొన్ని రోజులుగా దీపేష్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియడం లేదు. అతడు రియాకు క్లోజ్ ఫ్రెండ్ గా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరింతగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుశాంత్ మృతికి సంబంధించి ఆయన్ను విచారిస్తే మరింత సమాచారం లభించే అవకాశం ఉందంటున్నారు. మరి సీబీఐ వారు అయినా ఆయన్ను పట్టుకుని విచారణ చేస్తారేమో చూడాలి. కేసును సీబీఐ టేకోవర్ చేసిన తర్వాత మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయంలో బీహార్ పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని టాక్.
× RELATED షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇంకా హైదరాబాద్ లోనే రకుల్
×