'గ్లామరసం'తో మతులు పోగొడుతున్న మాస్ రాజా బ్యూటీ!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల తర్వాత ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించుకునేది హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించే అందాల భామలే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది అంజనా సుఖాని. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డాన్ శీను సినిమాలో శ్రీయ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించింది అంజనా. ఫస్ట్ సినిమాలోనే విపరీతంగా అందాలను ఆరబోసింది. జైపూర్ లో పుట్టి పెరిగిన అంజనా యూకెలోని కార్డిఫ్ మెట్రోపోలిటన్ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ పట్టా పొందింది. ఇక ఈ భామ తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా డాన్ శీను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకో మరి మళ్లీ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి తెలుగులో అడుగుపెట్టిన అంజనా.. తెలుగులో ఒక సినిమా తర్వాత మళ్లీ నిలబడలేకపోయింది. ఇక చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించిన ఈ భామ చాలా యాడ్ ఫిలిమ్స్ లో మెరిసింది.

అంజనాను చాక్లెట్ గర్ల్ గా పాపులర్ అయింది. ఎందుకంటే మోడలింగులో ఉన్నప్పుడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి క్యాడ్బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్ మోడల్ గా నటించింది. అమ్మడి గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి కానీ అవకాశాలే కరువయ్యాయి. నిజానికి తెలుగులో డాన్ శీను కంటే ముందే ఓ సినిమా చేసింది. 2005లో 'నా ఊపిరి' సినిమాలో మెరిసింది. ఆ సినిమా కాస్త బోల్తా కొట్టింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ భామ తెలుగు హిందీతో పాటు మరాఠీ తమిళ కన్నడ బాషలలో కూడా పలు సినిమాలు చేసింది. ఇక తాజాగా అంజనా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ గ్లామరస్ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడి అందాలు చూస్తూ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్సులో బికినీ రేంజ్ అందాలు బయట పెట్టింది. ఇక స్టైలిష్ అంజనా తన ఎద సంపద అంతా ఫ్యాన్స్ కళ్ల ముందు నిలిపింది. మరి నెటిజన్లు ఇన్నేళ్లయినా ఏ మాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
× RELATED షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇంకా హైదరాబాద్ లోనే రకుల్
×