పవన్ తో సోము వీర్రాజు.. టార్గెట్ అదేనా?

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాక తిన్నగా హైదరాబాద్ వచ్చి చిరంజీవి - జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటి మర్యాదపూర్వకమేనని సోము వీర్రాజు చెప్పినా భవిష్యత్లులో ఏపీ రాజకీయాల్లో అవలంభించబోయే వ్యవహారమే ఇదంతా అని అనుకుంటున్నారు.

మూడు రాజధానులను పవన్ వ్యతిరేకించారు. అమరావతి రైతులకు అండగా ఉంటామన్నారు. వారి పోరాటానికి సహకరిస్తానన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ మాత్రం జగన్ మూడు రాజధానులకే జైకొట్టింది. ఈ క్రమంలోనే వీరిద్దరి భేటిలో అమరావతి మార్పు.. మూడు రాజధానులపై ఏకాభిప్రాయంతో కేంద్రం నిర్ణయానుసారం వెళదామనే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు ఉంది. స్థానిక ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ సమయంలో మూడు రాజధానులపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

మూడు రాజధానులపై తాము జోక్యం చేసుకోబోమని.. ఈ వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ను ఒప్పించడానికే సోము వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక టీడీపీ వైసీపీల నుంచి కాపు సామాజికవర్గాన్ని విడదీసి ఒక్కటి చేయాలని 2024లో ఓటు బ్యాంకుగా కాపాడుకోవాలని వీరిద్దరూ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


× RELATED తాజాగా రూపాయే అయినా.. ఇప్పటికి అన్నిసార్లు పెంచేశారు
×