చచ్చిపోతున్నా బతికించండి.. శ్రీకాకుళం యువకుడి నరకయాతన

కరోనా ధాటికి చెట్టంత మనుషులు కూడా మృత్యువుకు దగ్గరవుతున్న పరిస్థితి నెలకొంది. ఏపీలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోవడం వైద్య సహాయం అందించడం కనాకష్టం అవుతోంది.

ఈ క్రమంలోనే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు తన ప్రాణాలు పోతున్నాయని కాపాడండి.. బతికించండి అంటూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో ఓ యువకుడు చేరాడు. అతనితోపాటు తల్లి కూడా ఉన్నారు. తనకు ప్లేట్ లెట్స్ పడిపోయాయని.. తనకు కరోనా అని చెప్పి సరిగా వైద్యం అందించడం లేదని ఆ యువకుడు వాపోయాడు. రక్తం కారుతోందని.. తాను చనిపోతానని.. తనకు కూడా ఆ విషయం తెలుసు అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటలు అందరినీ కదిలించేలా ఉన్నాయి.

తనతో పాటు తల్లి కూడా ఉందని.. ఆమెను కాపాడాలని యువకుడు వేడుకున్నాడు. తాను చనిపోయినా ఆమె ఒంటరి అవుతుందని.. ఆమెను బాగా చూసుకోవాలంటూ ప్రాధేయపడ్డాడు.
× RELATED తాజాగా రూపాయే అయినా.. ఇప్పటికి అన్నిసార్లు పెంచేశారు
×