తంబిలు అంతే.. ట్విట్టర్ లో రావణుడిపై ప్రశంసల వర్షం

ఊరంతా ఒకటైతే.. ఉలిపికట్ట మాత్రం అన్న చందంగా తమిళుల తీరు ఉందని చెప్పాలి. అయోధ్యలో శ్రీరామాలయానికి భూమిపూజ చేస్తున్న వేళ.. యావత్ దేశం మొత్తం రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఇలాంటివేళ.. తమిళనాడు మాత్రం అందుకు భిన్నంగా రావణ నామ స్మరణ జరుగుతుండటం.. సోషల్ మీడియాలో రావణ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండటం భారత్ లోనే సాధ్యమేమో?

ఓవైపు రాముడి గుణగణాల్ని కీర్తిస్తున్న వేళలోనే.. తమిళులు మాత్రం రావణుడి గుణగణాల్ని కీర్తిస్తున్నారు. అతడి పరాక్రమాన్ని.. శౌర్యాన్ని ప్రశంసిస్తున్నరు. ట్విట్టర్ లో #LandOfRavana #LandOfRavan #TamilPrideRavana హ్యాష్ టాగ్ లు ట్రెండింగ్ అవుతున్నాయి. తమిళులు రావణుడ్ని.. అతడి శౌర్య పరాక్రమలను కీర్తించటం తెలిసిందే. దీనికి తగ్గట్లే తమిళనాడు ఇప్పుడు రావణ భజన సాగుతోంది.

ట్విట్టర్ లో రావణుడ్ని ఇరవైమూడు వేల మంది కీర్తిస్తున్నారు. 33వేల మంది ట్వీట్లు చేశారు. మొత్తంగా #LandOfRavan హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. మరికొందరు 2007లో రామసేతుకు వ్యతిరేకంగా స్వర్గీయ కరుణా నిధి చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ అవుతున్నాయి. రామ్ ఎవరు? అతను ఇంజనీర్ కాదా? రాముడు ఇంజనీర్ అని చెప్పటానికి చారిత్రక ఆధారాలు లేవంటూ కరుణ చేసిన వ్యంగ్య వ్యాఖ్యల్ని పలువురు షేర్ చేసుకుంటున్నారు. రామభక్తులకు మాత్రం ఈ తీరు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెప్పాలి.
× RELATED బ్రేకింగ్: 9మంది అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
×