టీడీపీ ఎంపీకి చంద్రబాబుకి డిష్యూం డిష్యూం?

టీడీపీ అధినేత చంద్రబాబు ‘అమరావతి’ రాజకీయంలో రాజీనామాలతో బలికావడానికి ఆయన పార్టీకి చెందిన ఏ ఎంపీ ఎమ్మెల్యే కూడా మొగ్గు చూపడం లేదట.. రాజీనామా చేయండని చంద్రబాబు కోరినా ఎంపీలు ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్నారట.. చేస్తే మీరు మీ అబ్బాయి లోకేష్ లు రాజీనామా చేయండని.. సవాల్ చేయండని చంద్రబాబుకే కౌంటర్ ఇస్తున్నారట.. ఇప్పుడు ఇదే విషయంలో టీడీపీలో ఒకేటే ఇకఇకలు పకపకలు వినిపిస్తున్నాయి..

48 గంటల డెడ్ లైన్ తర్వాత చంద్రబాబు పెద్ద తతంగం చేశాడంట.. గుంటూరు..విజయవాడ రాజధాని ఏరియాలో ఉన్న ఎంపీలు.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి స్కెచ్ గీశారట.. ఆ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు  మద్దలగిరి వంశీ ఎలాగూ వైసీపీలోకి జంప్ అయ్యారు కాబట్టి వారిని వదిలేయగా.. ఎంపీలు కేశినేని.. గల్లా జయదేవ్ లకు మీరు ఇద్దరూ రాజీనామా చేయండని చంద్రబాబు చెప్పారంట.. గల్లా జయదేవ్ నా పరిధి సీఆర్డీఏదని.. కాబట్టి కేశినేని నానితో చేయిస్తే సెంటిమెంట్ అని చంద్రబాబుకు వివరించి అలా ప్లాన్ చేయాలని సూచించాడట..

అయితే  కేశినేని నానితో చంద్రబాబు మాట్లాడితే.. ‘రాజీనామా చేస్తే అందరం చేద్దామని.. లేకపోతే వద్దు’ అని అన్నాడని టీడీపీ వర్గాల్లో టాక్.  అయితే చంద్రబాబు ఈ విషయంలో కేశినేనిని ఒప్పించడానికి ప్రయత్నించాడట.. దీనికి ఒళ్లుమండిన కేశినేని  ‘లోకేష్ ను మండలికి రాజీనామా చేయమను.. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతారు’ అని ఖరాఖండీగా చెప్పాడని టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
× RELATED తెలంగాణ : అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ !
×