చంద్రబాబు అసమర్థతను ఎత్తి చూపిన కేశినేని ?

ఏపీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందాక టీడీపీ పోరుబాట పట్టింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేయాలంటూ ఎన్నికలకు వెళ్దాం అంటూ సవాల్ చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త ఎత్తులు ఎస్తారా అన్నది వేచిచూడాలి.

అయితే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన ట్వీట్ సంచలనమైంది. ఆయన తెలుగుదేశం పార్టీ నేతల మనోభావాలను ప్రతిబింబించేలా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేశినేని ట్వీట్ చూస్తే.. ‘తాము కన్న కలలను సాకారం చేసుకోవడాని తామే ప్రయత్నించాలి తప్ప.. మరొకరు దాన్ని సాకారం చేయాలనుకోవడం సరైన పద్ధతి కాదు. అమరావతి అనేది చంద్రబాబు కన్న కల అది. అది సాకారం కావాలంటే 2024లో అధికారంలోకి రావాల్సి ఉంటుంది’ అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు అమరావతిని ప్రపంచ రాజధానిగా నిర్మించాలని కలలుగన్నారని చెప్పారు.

దీన్ని బట్టి కేశినేని చెప్పేదేంటంటే.. అమరావతిని కలలుగనడమే కాదు.. దాన్ని ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయాల్సి ఉండేది హితవు పలికారు. అలా పూర్తిచేయకుండా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరడం అవివేకం అనే తరహాలో కేశినేని.. చంద్రబాబుకు గట్టిగా ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.


× RELATED భట్టి వదిలేట్టు లేడుగా?.. డబుల్ బెడ్రూం మీద తాజాగా మరో షాక్
×