ఏపీ సీఎం జగన్ కు గుడి కడుతున్నారు

తమిళనాట సంస్కృతి ఏపీకి విస్తరిస్తోంది. అభిమానం హద్దులు దాటి గుడులు గోపురాల వరకు వెళ్లింది. అభిమాన హీరోలు.. హీరోయిన్లు రాజకీయ నేతలకు గుడి కట్టడం తమిళనాడులో ఫ్యాషన్ గా ఉంది.

ఇప్పుడు తమిళనాడుకు పొరుగునే ఆనుకొని ఉండే ఏపీలోనూ ఈ కల్చర్ వచ్చేసింది. ఏపీ సీఎం జగన్ పాలనకు ఫిదా అయ్యి ఏకంగా ఓ అభిమాని గుడికట్టేందుకు రెడీ అయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఏకంగా ఏపీ సీఎం జగన్ పాలనకు మైమరిచిపోయి గుడి కట్టేస్తున్నారు. జిల్లాలోని గోపాలపురం మండలం రాజంపాలెంలో ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ శంకుస్థాపన కూడా చేశారు.

జగన్ ఏపీలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారని.. ఈ పథకాలు భవిష్యత్ లో కూడా గుర్తుండి పోయేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా వైసీపీ నేత కూరకూరి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. జగన్ ను ఒక దేవుడిలా కొలవాలనే ఉద్దేశంతోనే కోవెల కడుతున్నట్లు స్తానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ చెప్పారు. జగన్ చెంతకు ఏ దుష్టశక్తులు చేరకూడదనే లక్ష్యంతోనే గుడి నిర్మిస్తున్నట్టు వివరించారు.
× RELATED భట్టి వదిలేట్టు లేడుగా?.. డబుల్ బెడ్రూం మీద తాజాగా మరో షాక్
×