కరోనాలో డెంగ్యూ.. దీన్నుంచి ఎలా కాపాడుకోవాలి?

భారతదేశంలో ఇది వానాకాలం సీజన్. దీంతోపాటు రోగాలు ప్రబలే సీజన్. ఈ క్రమంలోనే దోమలు పెరిగే కాలం. డెంగ్యూ కూడా ప్రారంభం అవుతుంది. దీంతో అందరిలోనూ భయాందోళనలతో గడుపుతున్నారు. భారత్ లో ప్రతీ సంవత్సరం డెంగ్యూ కేసుల సంఖ్య 25శాతం పెరుగుతోంది.

డెంగ్యూ జ్వరం వస్తే ప్రాణాలు కబళిస్తుంది. ప్లేట్ లెట్స్ పడిపోయి ప్రాణాలు తీస్తుంది. అందుకే డెంగ్యూ దోమలకు ఆవాసమైన నీటి గుంటలు.. ఖాళీ ప్రదేశాల్లో వస్తువుల్లో నీరు లేకుండా చూసుకోవాలి.

కరోనా లక్షణాలు.. డెంగ్యూ లక్షణాలతో సమానంగా ఉంటాయి కాబట్టి..కొంచెం శారీరక అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

డెంగ్యూ లక్షణాల్లో ప్రధానంగా శరీరంలో భరించలేని నొప్పి చేతులు కాళ్లు కీళ్లలో నొప్పి దద్దుర్లు తల కళ్ల చుట్టు నొప్పి వికారం వాంతులు కడుపునొప్పి ఆకలి లేక నాలుక రుచి కోల్పోవడం.. గొంతు నొప్పి మింగడానికి కష్టం అవుతుంది.

ఇక కరోనా లక్షణాలు చూస్తే.. తీవ్ర జ్వరం ఉంటుంది.. 3 రోజులైనా తగ్గదు. జలుబు ఉన్నా ముక్కు కారదు. పొడి దగ్గు.. రుచి వాసన తెలియదు.. ఒళ్లు తల గొంతు నొప్పి తీవ్రంగా ఉంటాయి. ఛాతిలో నొప్పి వస్తుంటుంది.. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. కళ్లు ఎర్రబడతాయి.. వాంతులు విరేచనాలు అవుతుంటాయి.

ఈ లక్షణాలు పరిశీలించి అది కరోనానా? లేక డెంగ్యూ జ్వరాలా తెలుసుకొని చికిత్స తీసుకుంటే బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డెంగ్యూ జ్వరాలను ప్లేట్ లెట్ కౌంట్ రక్తపరీక్షల ద్వారానే నిర్ధారిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.
× RELATED తెలంగాణ : అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ !
×