ఎంపీ కోమటిరెడ్డి ఇంటపెళ్లి సందడి .. ఆ వైసీపీ నేత కొడుకుతో ఎంపీ కోమటిరెడ్డి కుమార్తె నిశ్చితార్థం !

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాకి చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం జరిపించేందుకు ఇరువర్గాల కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఇరుకుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయినట్టు సమాచారం. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా చేశారు. ఈ వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీకి చెందిన నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఆ సమయంలోనే సీఎం జగన్ తో కూడా మంచి అనుబంధం ఏర్పడింది.
× RELATED భట్టి వదిలేట్టు లేడుగా?.. డబుల్ బెడ్రూం మీద తాజాగా మరో షాక్
×