కరోనా: డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఈ నియమాలు పాటించాలి

కరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది. కేసులు ఉప్పెనలా నమోదవుతున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న దీని ధాటి నుంచి తప్పించుకోవడం అంత ఈజీకాదు.

ఇక తీవ్రమైన దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఈ కరోనా మరింత డేంజర్. వారినే ఎక్కువగా కబళిస్తోంది. కరోనా సోకితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం.

ముఖ్యంగా డయాబెటిస్ (షుగర్) ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ ఉన్నప్పటికీ కరోనా బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ రోగులు ముఖ్యంగా బయటకు వెళ్లే సమయంలో మందంగా ఉండే మాస్క్ ను ధరించాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. సోషల్ డిస్టేన్స్ తప్పనిసరి. షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. శరీరంలో మార్పులను గమనించాలి. తేడా వస్తే డాక్టర్ ను సంప్రదించాలి.

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నరోగులకు కరోనా సోకితే చాలా ప్రమాదం. చికిత్స తీసుకోకుంటే న్యూమోనియా కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టైంలో గాయాలు కాకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధక పెంచే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
× RELATED భట్టి వదిలేట్టు లేడుగా?.. డబుల్ బెడ్రూం మీద తాజాగా మరో షాక్
×