'వకీల్ సాబ్'కి షాకిచ్చిన స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ పవర్ స్టార్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ గా మళ్లీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. హిందీలో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలింది. అయితే తాజాగా ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ శృతి హాసన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గబ్బర్ సింగ్ కాటంరాయుడు సినిమాల తర్వాత శృతి పవన్ తో ఇదే హ్యాట్రిక్ మూవీ అని అభిమానులు అనుకుంటున్నారు.

అయితే ఈ మధ్య శృతిహాసన్ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. ఇటీవలే ఓ లైవ్ లో తన అభిమానులతో ముచ్చటించింది శృతి. వకీల్ సాబ్ చిత్రంలో మీరు హీరోయినుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.. నిజమేనా? అని ఓ నెటిజన్ అడిగాడు. ఆ ప్రశ్నకు 'తను ఇప్పుడప్పుడే ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేనని చెప్పింది. ఇక నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా శృతి అక్టోబర్ లోపు షూట్ చేస్తే వకీల్ సాబ్ లో నటిస్తాను. లేదంటే ఆ తర్వాత డేట్స్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిందట. ఈ వార్తతో వకీల్ సాబ్ టీమ్ కి షాక్ తగిలినట్లే అయింది. మరి ఈ లెక్కన కరోనా కారణంగా ఇప్పట్లో షూటింగ్ సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో వెల్లడించాడు. ఈ దెబ్బతో 'వకీల్ సాబ్'లో శృతి ఉండకపోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి సినీవర్గాలు.


× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×