యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కంచె బ్యూటీ...!

'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కి టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదనే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో 'డేగ' అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రగ్యా ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' 'సినిమాలో నటించినా అమ్మడి కెరీర్ కి ఉపయోగపడలేదు. అయితే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన 'కంచె' సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోనుందని అందరూ భావించారు. కానీ అమ్మడికి చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోగా యాక్ట్ చేసిన సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. అందాలు ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ వేడిపుట్టించే ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది ప్రగ్యా.

కాగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డబ్బులు సంపాదించేందుకు బోలెడన్ని ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి ఓవైపు పేరుతో పాటు మరోవైపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ ని ఓపెన్ చేసారు. ఇటీవల శృతి హాసన్ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. లేటెస్టుగా ప్రగ్యా జైస్వాల్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. హెల్త్ ఫుడ్ ట్రావెలింగ్ ఫిట్నెస్ యోగా వర్కౌట్ లకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటానని.. నా యూట్యూబ్ ఛానల్ ని సుబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి అని చెప్పుకొచ్చింది. జపనీస్ చీస్ కేక్ తయారు చేస్తూ ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది. అయితే అమ్మడికి ఆఫర్స్ లేకనే యూట్యూబ్ ఛానల్ పై ద్రుష్టి పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.Excited to finally share that I’m launching my Youtube Channel from today..

× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×