'సెల్ఫీ స్మైల్'తో మాయ చేస్తున్న సిండ్రెల్లా బ్యూటీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లక్ష్మీ రాయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ భామ 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది. అయితే లక్ష్మిరాయ్ సినిమాల కంటే కూడా ఎక్కువగా వివాదాలల్లోనే నిలిచింది. అమ్మడు హీరోయినుగా ఎంట్రీ ఇచ్చి దశాబ్దం గడిచినా ఇప్పటివరకు సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అందంతో పాటు టాలెంట్ ఉన్న ఈ కన్నడ భామకి హీరోయినుగా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ మలయాళం కన్నడ సినిమాలలో మెరిసిన లక్ష్మీరాయ్.. ఇప్పటికి హీరోయినుగా నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం గడుస్తున్నా సరైన హిట్ కోసం ఎదురు చూస్తుంది. మధ్యలో కెరీర్ బాలేదని లక్ష్మీరాయ్ పేరు కాస్త రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ప్రస్తుతం ఎక్కువగా హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తూ ఉండటంతో అప్పుడప్పుడు ఆ జోనర్లో ఎక్కువగా లక్ష్మి రాయ్ సినిమాలు చేస్తూ వస్తుంది. హర్రర్ సినిమాలలో సత్తా చాటుతున్న సక్సెస్ మాత్రం రావట్లేదు. అయితే ఈసారి లక్ష్మీరాయ్ ఏకంగా మూడు పాత్రలలో మెప్పించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సిండ్రెల్లా అనే తమిళ హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది.

ఇప్పటి వరకు అన్నీ బాషలలో కలిపి 50 సినిమాలు పూర్తిచేసుకున్న లక్ష్మి.. ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ చేస్తుంది. ఈరోజుల్లో డ్యూయల్ రోల్ దొరకడమే కష్టం అనుకుంటే.. ఏకంగా సిండ్రెల్లా సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తుంది. ఇక జూలీ-2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న లక్ష్మి సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేసింది. మూడుపదుల వయసు దాటిన ఈ భామ గులాబీ రంగు డ్రెస్సులో అందమైన చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుకే నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం అమ్మడి పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×