'ప్రజారాజ్యంలో బావరాజ్యం' వార్తలపై ఆర్జీవీ కామెంట్...!

వివాదస్పసద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'క్లైమాక్స్' 'నగ్నం' 'పవర్ స్టార్' అనే సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేసిన వర్మ ''మర్డర్'' ''థ్రిల్లర్'' అనే మరో రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేసారు. ఫిక్షనల్ రియాలిటీ జోనర్ లో ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ - ఒమేగా స్టార్ - సీబెఎన్ - లాకేష్ - వై ఎస్ జగన్ - KCAR - KTARలు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని చెప్పుకొచ్చారు. వర్మ చెప్పకపోయినా అవన్నీ నిజజీవితంలో పాత్రలను పోలి ఉన్నవని అందరికి తెలుసు. దీంతోపాటు అల్లు అరవింద్ పై సెటైరికల్ గా ''ప్రజారాజ్యంలో బావరాజ్యం'' అనే సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవీ ఈ వార్తలపై స్పందించారు.

ఆర్జీవీ మాట్లాడుతూ.. ''గత 20 ఏళ్లుగా నాకు నచ్చిన విధంగా నేను సినిమాలు తీసుకొంటూ వస్తున్నాను. మీకు నచ్చితే చూడండి లేకపోతే చూడొద్దు. నాపై కామెంట్లు చేస్తే పట్టించుకోవడానికి నాకు అంత సమయం లేదు. నేను బూతు సినిమాలు తీస్తున్నారంటే ఒప్పుకోను. 'పవర్ స్టార్' 'కరోనా' 'అమృత' సెక్స్ సినిమాలా? అందులో సెక్స్ ఉందా?. ఇతర కథలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను. కొందరికి హిపోక్రసీ. శృంగారాన్ని సపరేట్ అంశంగా చేసి దానిని ప్రత్యేకంగా చూస్తారు. నాకు అలా చూడటం ఇష్టం ఉండదు. అన్ని ఎమోషన్స్ మాదిరిగానే దానిని కూడా చూస్తాను'' అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా చిరంజీవి - అల్లు అరవింద్ ను టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారనే వార్తలపై నేను స్పందించను. నేను ఏ సినిమా తీయాలి.. దానిని ఎప్పుడు అనౌన్స్ చేయాలి అనేది నా ఇష్టం. నా సినిమాల గురించి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు సంబంధించిన అంశం. 'ప్రజారాజ్యంలో బావరాజ్యం' అనే సినిమా తీస్తున్నానని వచ్చే వార్తలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.


× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×