'అసురన్'తో జోడి కట్టనున్న మాస్టర్ బ్యూటీ!

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో ధనుష్ సృష్టిస్తున్న రచ్చ మాములుది కాదు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ కాన్సెప్టులతో స్టార్ హీరోగా ఎదిగిన తీరు అభినందనీయం. ఈ ఏడాది ప్రారంభంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానరు పై ధనుష్ నటించిన ‘పటాస్’ విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు మళ్లీ అదే బ్యానరులో ధనుష్ నటించనున్నాడు. అయితే ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కార్తిక్ నరేన్ దర్శకత్వం వహించనున్నాడు. ‘ధ్రువంగళ్ పదినారు’ చిత్రంతో తమిళంలో కార్తిక్ నరేన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నరేన్.. అరుణ్ విజయ్తో ‘మాఫియా’ అలాగే అరవింద్స్వామితో ‘నరగాసురన్’ చిత్రాలను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో ధనుష్ 43వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. అక్టోబరులో దీనిని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయినుగా మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ నటించనుందని సినీవర్గాల సమాచారం. అయితే ఇటీవల ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మాళవిక శుభాకాంక్షలు చెప్పడంతో పాటు తనకు ధనుష్ తో కలిసి నటించాలనే కోరుకను కూడా బయట పెట్టింది. వెంటనే ధనుష్ నీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని రిప్లై ఇచ్చాడు. ఇక తాజాగా డి43లో మాళవికను తీసుకుంటామని.. అలాగే త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ప్రొడ్యూసర్ టిజి త్యాగరాజన్ తెలిపినట్లు ఇండస్ట్రీ టాక్. మరి అదే గనక నిజమైతే మాళవిక కోరిక నిజమైనట్లే. కానీ అడగ్గానే అమ్మడికి ఛాన్స్ దొరికిందంటే అదృష్టం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నాడు. ఇటీవల ధనుష్ జీవీ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’ సినిమా సంగీతం పరంగా బ్లాక్బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. చూడాలి మరి d43 ఎప్పుడు పట్టాలెక్కుతుందో..!


× RELATED పూరీ 'సెన్సాఫ్ హ్యూమర్'...!
×