బ్రేకింగ్: కరోనాతో బీజేపీ మాజీ మంత్రి మణిక్యాల రావు కన్నుమూత

ఏపీలో కరోనా ధాటికి ఓ బిగ్ షాట్ కన్నుమూశారు. బీజేపీ మాజీ మంత్రి మణిక్యాల రావు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు..

మాణిక్యాల రావుకు గత నెలలోనే కరోనా సోకింది. ఆయన నెలరోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమించి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది.

ఏపీలో ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నతాధికారులకు కరోనా సోకినా ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదు. కానీ ఏకంగా ఓ మాజీ మంత్రి బీజేపీ నేత కరోనాతో మృతి చెందడం రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది.
× RELATED జగన్ కు షాక్... నిలిపిన వేతనాలు వడ్డీతో చెల్లించాల్సిందేనట
×