స్టార్ నటుడి కుమార్తెను వేదించిన వ్యక్తి అరెస్ట్

బాలీవుడ్ ప్రముఖ నటుడి కుమార్తెను గత కొన్ని రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తూ వేదిస్తున్న వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసులు మొత్తం రహస్యంగా ఉంచారు. అయితే వ్యక్తి అరెస్ట్ విషయాన్ని మాత్రం నిర్థారించారు. వారి సెక్యూరిటీ మరియు ఇతర కారణాల వల్ల ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనే విషయాన్ని పోలీసులు తెలియజేయాలనుకోవడం లేదట. దాదాపుగా ఆరు పదుల వయసు ఉంటే ఆ స్టార్ నటుడి కుమార్తెను ఆకతాయి వేదిస్తున్నట్లుగా ఇటీవలే ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

నటుడి కుమార్తెకు చెందిన ఫొటోలను మరియు వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆ వ్యక్తి గతంలో ఇంకా పలువురిని కూడా ఇలాగే వేదించాడు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. అతడి వద్ద నుండి ల్యాప్ టాప్ మరియు రెండు మొబైల్స్ ను స్వాదీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న అతడిపై పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడి గురించి నటుడి కుమార్తె పోలీసులకు చెప్పాల్సి వచ్చిందట.
× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×