కియరా ప్రేమలో పసోడు.. బర్త్ డే రోజు కౌగిలింత కావాలట!

కెరీర్ ప్రారంభించిన ఐదారేళ్లలోనే స్కైలోకి దూసుకెళ్లింది కియరా. ప్రతిభకు లక్ కలిసొచ్చి సక్సెస్ తోడై  ఈ అమ్మడి రేంజ్ ఇంతింతై అన్నట్టుగా ఎదిగేసింది. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. పనిలోపనిగా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిందన్న పుకార్ ఎలానూ ఉంది.

కియరా పుట్టినరోజు సందర్భంగా ఆ ఇద్దరి మధ్యా ఎఫైర్ మ్యాటర్ మరోసారి అభిమానుల్లో హాట్ టాపిగ్గా మారింది. 28వ బర్త్ డే కాబట్టి... పుట్టినరోజు కేక్ లో 28 కొవ్వొత్తులను వెలిగించింది. అభిమానులు.. స్నేహితులు .. సహచరులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. వీటన్నిటినీ మించి `షేర్షా` సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నుండి ఒక స్వీట్ మెసేజ్ వచ్చింది. సిద్ధార్థ్ తన ఇన్ స్టాగ్రామ్ లో కియారా అద్వానీ ఫోటోని పోస్ట్ చేసి ఆల్మోస్ట్ ప్రపోజ్ చేసినంత పని చేశాడు. ``పుట్టినరోజు శుభాకాంక్షలు షైనింగ్ గాళ్...నీకు నా ప్రేమ .. కౌగిలింతలు`` అంటూ నిజంగానే ప్రేమను కురిపించాడు. దానికి ప్రతిస్పందిస్తూ.. `ధన్యవాదాలు మంకీ`` అని రిప్లయ్ ఇచ్చింది.

కియారా అద్వానీతో సిద్ధార్థ్ లవ్ స్టోరీ ఇప్పటిది కాదు. షేర్షా షూటింగ్ సమయంలో పరిచయం ప్రేమగా మారిందని కథనాలొచ్చాయి. ఆ తర్వాత దానికి కియరా ఖండించనూ లేదు.. అంగీకరించిందీ లేదు. కార్గిల్ యుద్ధంలో మరణించి పరం వీర్ చక్ర బిరుదాంకితుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో నటించేప్పుడే ఇద్దరి మధ్యా చనువు పెరిగింది.

కియారా అద్వానీ చివరిసారిగా నెట్ఫ్లిక్స్ గిల్టీలో కనిపించింది. సినీకెరీర్ సంగతి చూస్తే.. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్.. సిధార్థ్ మల్హోత్రా- భూల్ బులయా 2.. కార్తీక్ ఆర్యన్ ఇందూ కి జవానీ చిత్రాల్లో కియరా నటించింది. 2014లో ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కియరా 2016 లో ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీలో నటించింది. ఆ చిత్రం తన ఫేట్ మార్చేసింది. భరత్ అనే నేను.. వినయ విధేయ రామ లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. కబీర్ సింగ్- గుడ్ న్యూజ్ చిత్రాల సక్సెస్ తో బాలీవుడ్ లో మరో మెట్టు పైకి ఎక్కింది.
× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×