రాబోయే రెండు నెలల్లో అధిక వర్షాలు : ఐఎండీ

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికంటే కొద్దిగా ముందే దేశంలో ఎంట్రీ ఇచ్చినా.. తొలి రెండు నెలల్లో ఆశించిన వర్షపాతం కురువలేదు. జూన్ 1 నాటికి కేరళను తాకిన నైరుతి.. ఆ తర్వాత 18 రోజుల్లోనే దేశమంతటా విస్తరించడంతో రైతాంగంలో హర్షం వ్యక్తమయ్యింది. అయితే జులైలో మాత్రం రుతుపవనాలు కొద్దిగా ముఖం చాటేశాయి. వాయువ్య మధ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. నైరుతి రుతుపవనాలు నాలుగు నెలల్లో సగం రోజులు గడిచిపోవడంతో రాబోయే రెండు నెలలకు సంబంధించి వర్షపాతం అంచనాలను ఐఎండీ శుక్రవారం వెల్లడించింది.

దేశంలో రాబోయే రెండు నెలల్లో అధిక వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని భారతీయ వాతావరణశాఖ చెప్పింది. రుతుపవనాల వల్ల సెప్టెంబర్లోనూ 104 శాతం అధిక వర్షం కురిసే ఛాన్సు ఉందని అధికారులు చెప్పారు. జూలై 30 వరకు దేశవ్యాప్తంగా 44.7 శాతం వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సమృద్ధిగా వర్షాలు కురవడం వల్లే.. రైతులు అధిక స్థాయిలో విత్తనాలు నాటినట్లు అంచనా వేస్తున్నారు. వర్షాకాలం రెండవ అర్థభాగంలో కావాల్సినంత వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ శుక్రవారం తెలిపింది.

సెప్టెంబర్ లో సుమారు 20 శాతం వర్షాలు అధికంగా కురవనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. జూలై లో అనుకున్నంతగా వర్షాలు కురవకున్నా..సెప్టెంబర్లో అధిక వర్షాలు పడే ఛాన్సు ఉందని ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. జూలైలో సాధారణ వర్షపాతం ఎల్పిఎలో 103% ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడం వర్షాకాలం నిరుత్సాహపరిచింది. జులై నెలలో ఒక్క అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడలేదు.
× RELATED జగన్ కు షాక్... నిలిపిన వేతనాలు వడ్డీతో చెల్లించాల్సిందేనట
×