బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన హీరోయిన్.. కారణం అదేనట!!

పూనమ్ కౌర్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూనమ్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతూనే ఉంది. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాను ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్నీవిధాలుగా వాడుకుంటుంది. ఆమె ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని సమస్యల పై స్పందిస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటుందని అంతా భావిస్తున్నారు. అందుకే కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పూనమ్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ పూనమ్ అవేవి పట్టించుకోకుండా తను చెప్పాల్సింది ముక్కుసూటిగా చెప్పేస్తుంది. అయితే ఇటీవలే తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ సీసన్ ప్రారంభం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే త్వరలో ప్రారంభం కాబోతుందని ప్రోమో వీడియోలను కూడా విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పుడిప్పుడే కంటెస్టెంటులను ఎంపిక చేస్తున్నారట. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ ను కూడా బిగ్ బాస్ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తుంది. గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో వివాదాలతో ట్రెండింగ్ అవుతోంది పూనమ్.  అయితే పూనమ్ వలన బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ పెంచుకోవచ్చనే ఆలోచనతో ఆమెను సంప్రదించారని వార్తలొస్తున్నాయి. అంతేగాక బిగ్ బాస్ షోకి వచ్చి టిఆర్పి రేటింగ్ కోసం ఆమె వివాదాలు మాట్లాడేది కాదని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో బిగ్ బాస్ టీమ్ ఆమెను రిజెక్ట్ చేశారట. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే.. బిగ్ బాస్ ప్రపోసల్ ను పూనమే రిజెక్ట్ చేసిందట. ఏ ఛానల్ అయినా ఏ ప్రోగ్రాం అయినా తమ టిఆర్పి రేట్ల కోసం ఎవరినైనా కన్విన్స్ చేస్తాయి. కానీ పూనమ్ అలా కాదంటుంది. అంటే మొత్తానికి పూనమ్ బిగ్ బాస్ షోలో కనిపించదని అర్ధమవుతుంది.
× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×