ఒంటరిగా ఉంటే ఇవేం పాడు వేషాలో శ్రుతీ

ఒంటరిగా ఉంటే ఇవేం పాడు ఆలోచనలో కానీ ఇదిగో ఇక్కడ శ్రుతిహాసన్ ఏం చేస్తోందో చూశారా? ఒంటరి జీవితం తుంటరి ఆలోచనల్ని ఏమాత్రం భేషజానికి పోకుండా ఎలా షేర్ చేస్కుందో కదా! ఈ అమ్మడు ఇన్ స్టా వీడియో ప్రస్తుతం నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతగా ఏం ఉంది ఈ వీడియోలో అంటారా?  మీరే లుక్కేయండి..

ఆ వీడియో క్లిప్ జాగ్రత్తగా పరిశీలిస్తే.. శ్రుతి రకరకాల వేషాలు వేస్తూ హీట్ పెంచేస్తోంది. మంచం మీంచి లేజీగా లేస్తోంది... బంతులు గాల్లో విసిరి గారడీ చేస్తోంది.. తన జుట్టును వాసన చూస్తోంది... ఫోటోషూట్లలో నటిస్తోంది.. ఇంకా ఏవేవో కొంటె వేషాల్ని బయటపెట్టిందిలా. లాక్ డౌన్ లో ఏ ఒక్క జీవితం అయినా 100 రోజుల తర్వాత ఇదిగో ఇలా కనిపిస్తుంది!! అంటూ జోక్ చేసింది కూడా.

శ్రుతి నటించిన తాజా చిత్రం `యారా` ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ హీరో. టిగ్మన్షు ధులియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రం `ఎ గ్యాంగ్ స్టోరీ` కి రీమేక్. మరోవైపు టాలీవుడ్ లోనూ శ్రుతి రీఎంట్రీ ఇస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహమ్మారీ లాక్ డౌన్ వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. లేదంటే ఈపాటికే ఈ మూవీ రిలీజ్ అయ్యేది.
× RELATED #DRUGS కూకటివేళ్లు సహా పెకలించాలి!- రవీనా టాండన్
×