పిక్చర్ పర్ఫెక్ట్: ఎదిగేస్తున్న డాటర్స్ తో మెగా డాటర్

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ లైఫ్ జర్నీ గురించి తెలిసిందే. తొలుత స్నేహితుడు శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ నివృతి అనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆ జంట మధ్య మనస్ఫర్థలు.. విడాకుల వ్యవహారం తెలిసిందే.

కాలక్రమంలోనే బిజినెస్ మేన్ కళ్యాణ్ దేవ్ ని శ్రీజ వివాహమాడారు. ఈ జంటకు కూడా ఒక ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తన పేరు నవిష్క. శ్రీజ పెద్ద కుమార్తె నివృతి వేగంగా ఎదిగేస్తోంది. అలాగే చూస్తుండగానే నవిష్క కూడా వేగంగానే ఎదిగేస్తోంది. శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం హీరోగా రాణించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు.

కుమార్తెలు నివృతి- నవిష్కతో కలిసి శ్రీజ దిగిన లేటెస్ట్ ఫోటో మెగాఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక శ్రీజ కుమార్తెలతో మెగాస్టార్ చిరంజీవి వీలున్న ప్రతిసారీ ఎంతో సందడిగా ఆటలాడుకోవడం చూస్తున్నదే. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×