కేసీఆర్ జగన్ పై సినిమాలు తీసే దమ్ముందా?

ఆర్జీవీ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ గురించి తెలిసిందే. కొన్నిసార్లు కొన్ని పిచ్చిపనులు చేస్తాడని విమర్శలు ఉన్నా ఆయన డేరింగ్ స్టైల్ వేరొకరికి రాదు. ముక్కుసూటిగా మాట్లాడేయడం.. తాను ఏది అనుకుంటే అది చేసేయడం అన్న స్టైల్ ప్రపంచంలోనే వేరే ఏ దర్శకుడికీ లేదేమో!

అందుకే అతడు బాలకృష్ణ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమాని తీశారు. "సిసలైన అన్నగారి బయోపిక్ మాదే!" నంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సహా నందమూరి కుటుంబమే అవాక్కయ్యేలా ఎన్నో విషయాల్ని ఆ సినిమాలో చూపించారు.

ప్రపంచం అంతా ఒక దారిలో ఉంటే తానొక్కడే వేరొక దారిలో వెళ్లే తెగువ ఆర్జీవీకే ఉంది. అదంతా సరే కానీ.. ఆయన మునుముందు కేసీఆర్ పైనా.. వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనా సినిమాలు తెరకెక్కించే ఆలోచన చేయగలరా? ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బయోపిక్ లు తెరకెక్కించే గట్స్ చూపించగలరా? అంటూ అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రశ్నిస్తున్నారు.

ఆర్జీవీకి నిజంగానే అంత దమ్ముందా? అంటూ సోషల్ మీడియాల్లో వ్యాఖ్యలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రస్తుతం `పవర్ స్టార్` టైటిల్ తో పవన్ కల్యాణ్ పై సినిమా తీస్తున్న వర్మ ఇలాగే జగన్ - కేసీఆర్ లపైనా సినిమాలు తీయగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఆర్జీవీ కి భయమా? అంటూ డిబేట్ స్టార్టయ్యింది. ఎన్టీఆర్ పైనే భయపడకుండా తీశాడు. చంద్రబాబు పాత్రను చూపించాడు. చినబాబు పైనా సెటైర్లు వేశాడు. ఇక ఆ పని కూడా చేయకపోతాడా? అంటూ ప్రశ్నల్ని గుప్పిస్తున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్నార్ గుడి మాఫియా అధినేత్రిగా పేరున్న శశికళపైనా సినిమా తీస్తానన్న ఆర్జీవీ మునుముందు అందుకు ప్రయత్నాలు చేయబోతున్నాడు. అలానే జగన్ .. కేసీఆర్ లపైనా సినిమాలు తీయకపోతారా? ఈ ప్రశ్నకు ఆర్జీవీనే సమాధానం చెప్పాల్సి ఉంది.
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×