ఫొటోటాక్ : ఆన్ లైన్ క్లాస్ లో జూ॥ పవర్ స్టార్ ??

స్టార్ కిడ్స్ ఫొటోలు ఎప్పుడు కూడా ప్రేక్షకులను నెటిజన్స్ ను ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఫొటో నెటిజన్స్ తెగ ఆకర్షిస్తూ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ తో విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో స్వతంత్య్రంగా జీవితాన్ని గడుపుతున్న రేణు దేశాయ్ వారిని కష్టపడి పెంచుతున్నారు. వారితో సరదా సమయాన్ని గడుపుతూ తన కష్టంను మర్చి పోతున్నారు. తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను రెగ్యులర్ గా షేర్ చేసే రేణు దేశాయ్ తాజాగా ఈ ఫొటోను షేర్ చేశారు.

అకీరా ఈ ఫొటోలో ల్యాప్ టాప్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఎక్కడ కూడా స్కూల్స్ కాలేజ్ లు జరగడం లేదు. చాలా వరకు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. కనుక అకీరా కూడా ఆన్ లైన్ క్లాస్ లు వింటున్నట్లుగా ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ ఫొటోను షేర్ చేసిన రేణు దేశాయ్ ఫన్నీగా ‘మై టాల్ ప్యాకేజ్ ఆఫ్ జాయ్’ అంటూ కామెంట్ పెట్టింది.

మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు వరుణ్ హైట్ ఎక్కువ అనుకున్నారు. కాని అతడిని మించిన హైట్ అకీరాకు ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఫొటోలో చూస్తుంటే నిజమే అయ్యి ఉంటుంది అనిపిస్తుంది. అకీరాకు ప్రస్తుతానికి సినిమాపై ఆసక్తి లేదంటూ గతంలో పలు సార్లు రేణు దేశాయ్ పేర్కొన్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం అకీరా హీరోగా పరిచయం అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు.
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×