'ఆచార్య' ఐటమ్ సాంగులో స్టార్ హీరోయిన్..!!

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా.. ఆచార్య పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు చిత్రబృందం. ఈ సినిమాను డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఇదివరకే కొత్త షెడ్యూల్ మొదలుకావాల్సి ఉందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలను రూపొందించడంలో డైరెక్టర్ కొరటాల శివ దిట్ట అనిపించుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందట. చిరు పాత్రలో ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని కొరటాల తెలిపారు. ప్రస్తుతం 40 శాతం కంప్లీట్ అయిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

ఈసారి మెగాస్టార్ మార్కు డ్యాన్సులు ఎంటర్టైన్మెంట్ మిస్సవ్వకూడదని ఫిక్సయ్యారట చిరంజీవి. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మను సిద్ధం చేశారు. మణిశర్మకు దాదాపు 12యేళ్ల తర్వాత మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. మెగాస్టార్ - మణిశర్మ కాంబినేషన్లో మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందో ఇదివరకే చాలా ఆల్బమ్స్ తో నిరూపించారు. మరోసారి తెలుగు ప్రేక్షకులకు రుచి చూపాలని అనుకుంటున్నారట మణిశర్మ. ఇటీవలే ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయని.. అందులో ఓ మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇక మెగా అభిమానులు ఊరుకుంటారా.. మణిశర్మ చిరంజీవి కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్.. అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ ఐటమ్ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ నర్తించనుందని టాక్. ఆమె ఎవరు ఏంటి.. అనేది తెలియదు కానీ ప్రస్తుతం తమన్నా పేరు బాగా ప్రచారం అవుతోంది. చూడాలి మరి చిరు సరసన చిందేసే ఛాన్స్ ఎవరికీ వస్తుందో..!!
× RELATED సారీలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
×