ఫోటో స్టోరి: శర్మా గాళ్ దుమ్ము దుమారం

మాళవిక శర్మ .. పరిచయం అవసరం లేని నేమ్ ఇది. మాస్ మహారాజ్ సరసన నేల టిక్కెట్ చిత్రంలో నటించింది. కానీ ఆరంభం ఆశించిన హిట్టు దక్కలేదు. మాళవిక బెస్ట్ మోడల్ కం డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నా అదీ యూజ్ లెస్ అయ్యింది. అయినా ఇంకా పట్టువదలని విక్రమార్కుని చెల్లెలులా టాలీవుడ్ లో ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు ఈ కుర్రబ్యూటీ.

కాలేజ్ రోజుల్లోనే మోడలింగ్ లో అడుగు పెట్టిన మాళవిక అటుపై టాలీవుడ్ బాలీవుడ్ లో సినీకెరీర్ ని వెతుక్కుంటూ పయనం సాగిస్తోంది. ఈ జర్నీలో ఎన్నో బ్రేకులు పడినా అలుపెరగకుండా పోరు సాగిస్తోంది. అయితే ఆశించిన స్థాయి అవకాశం ఇప్పటివరకూ రానే లేదు. మరి ఈ ముద్దుగుమ్మకు జాక్ పాట్ ఎప్పటికి తగిలేనో!

టాప్ మోడల్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ అమ్మడు కెరీర్ కోసం పాకులాడని రోజు లేదు. కానీ ఆశించినది దక్కడం లేదు. ఇటీవల సోషల్ మీడియాల్లో జరంత స్పీడ్ గానే ఉంది. మొన్నటికి మొన్న ఇన్ స్టా మాధ్యమంలో తెల్లకోకలో బిగువుల అందాల్ని ఎరవేస్తూ మాళవిక శర్మ ఇచ్చిన ట్రీట్ యూత్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇన్ స్టాలో యోగా.. జిమ్ ఫోజులకు అంతే మైలేజ్ దక్కింది.

తాజాగా మరోసారి అల్ట్రా మోడ్రన్ లుక్ లో శర్మా గాళ్ దర్శనమిచ్చింది. పొట్టినిక్కరులో థై అందాల్ని ఆరాంగా ఆరబోసి యూత్ గుండెల్ని గిచ్చేస్తోంది. వైట్ జల్లెడ ఫ్రాకులో కనిపించిన మాళవిక అసలు బాటమ్ వేర్ మరిచిపోయిందా లేదా? అనిపించేంతగా చిట్టి పొట్టి చినుగుల డెనిమ్ లో దుమ్ము దుమారం అనిపించేసింది. మాళవిక లోని ఈ క్రియేటివిటీ చూశాక అయినా తనకు ఆశించిన ఆ ఒక్క ఛాన్స్ దక్కకపోతుందంటారా?  గూగుల్ వెతికితే  ఇంకా వీకీ స్టారేనా వీకీపిడియాలోకి ఎప్పుడు వస్తుందో ఏమిటో!
× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×