నేనింత వాడిని అవ్వడానికి ఆయనే కారణం : రజిని

సూపర్ స్టార్ రజినీకాంత్ తన గురువుగా కె బాలచందర్ ఎప్పటికి చెబుతూనే ఉంటారు. ఆయన వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందని.. నా సినీ జీవితానికి ఆయనే కారణం అంటూ పలు వేదికల మీద చెప్పిన విషయం తెలిసిందే. నేడు కె బాలచందర్ 90 వ జయంతి సందర్భంగా రజినీకాంత్ మరో సారి తన గురువును గుర్తు చేసుకున్నాడు. ఒక వీడియోను విడుదల చేసిన రజిని అందులో గురువుపై మరోసారి తన అభిమానాన్ని. చాటుకున్నాడు.

విడియాలో రజిని మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం బాలచందర్ గారు. నాకు మాత్రమే కాకుండా ఎంతో మందికి ఆయన జీవితాన్ని ఇచ్చారు. నా పేరును మార్చి అందరికి చేరువ అయ్యేలా చేశారు. కెరీర్ ఆరంభంలో నాకు ఎక్కువగా ఆయనతో సినిమాలు చేసే అవకాశం రావడం వల్ల ఇంతటి స్టార్ డం దక్కిందని అన్నాడు.

తన తల్లిదండ్రులు.. సోదరుడు.. కె బాలచందర్ గారు నాకు దైవ స్వరూపులు. ఎంతో మంది దర్శకులతో నేను వర్క్ చేశాను. కానీ బాలచందర్ గారు సెట్ లో అడుగు పెట్టినప్పుడు మాత్రమే అంత నిలబడి నమస్కారం చేసేవారని రజిని గుర్తు చేసుకున్నారు. ఆయన గొప్ప దర్శకుడిగా రజిని పేర్కొన్నాడు.
× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×