ఆన్ లైన్ క్లాసులపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుంది. ప్రభుత్వం మహమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో  విద్యా సంస్థలు తెరవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  కేంద్రీయ విద్యాలయ సంస్థలతో పాటు కొన్ని విద్యా సంస్థలు సమయం వృథా కాకుండా ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తున్నాయి.  ఇది కొంతమేర బాగున్నప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆన్ లైన్ క్లాసులకి ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఆందోళన చేస్తున్నారు.

అసలు ఎల్ కేజీ నుంచి ఆన్ లైన్ క్లాస్ లు ఏంటి  అని  ప్రజాసంఘాల నాయకులు విద్యా వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో ఈ  ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై పెత్త ఎత్తున చర్చ రచ్చ జరుగుతోంది. కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపథ్యంలోనే  తరగతుల నిర్వహణపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం ఇలా సాగుతున్న సమయంలోనే  ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై బాంబే హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది.

ఆన్ లైన్ క్లాసులు వ్యతిరేకించడాన్ని జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అంటూ ఆన్ లైన్ క్లాసులని  గొప్ప ప్రగతిశీల చర్యగా అభిప్రాయపడింది. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని ప్రస్తుతం ఈ  ప్రపంచం డిజిటల్ యుగంలో పరుగులు తీస్తుంది అని డిజిటల్ వర్చువల్ లెర్నింగ్ను అందరూ ప్రోత్సహించాలని కోర్టు తెలిపింది. దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ లో ఏమైనా విధాన పరమైన  ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని   ఆన్ లైన్ క్లాసుల నిర్వహణలో లోపా లను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో ఇప్పుడు  బాంబే హైకోర్టు చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
× RELATED ఫేస్ బుక్ తాజా నిర్ణయం..వచ్చే జులై వరకు వర్క్ ఫ్రం హోం!
×