దారుణం.. కుక్క కనిపించట్లేదని ఇరుగున ఇద్దరిని కాల్చి చంపాడు

పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమాభిమానాలు ఒక వ్యక్తిని విచక్షణ కోల్పోయేలా చేసింది. ఇద్దరిని కాల్చి చంపే వరకూ విషయం వెళ్లింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో సదరు వ్యక్తి హతమైన ఉదంతం తాజాగా సంచలనంగా మారింది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ జరిగిందేమంటే?

ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీకు చెందిన 82 ఏళ్ల డోల్సెరోకు ఒక పెంపుడు కుక్క ఉంది. ఈ మధ్యన ఆ కుక్క పొరిగింట్లో ఉన్న అలెగ్జాండర్ హాన్సమన్ అనే వ్యక్తి భార్యను కరిచింది. దీంతో.. ఆ కుటుంబ సభ్యులు ఈ కుక్క మీద అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. ఈ ఉదంతంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇదే క్రమంలో ఆ కుక్క కనిపించలేదు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 82 ఏళ్ల ముసలాయన రెండు చేతులతో రెండు తుపాకీల్ని పట్టుకొని అలెగ్జాండర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంటి యజమానిని కాల్చి చంపాడు. జరుగుతున్న హింసతో హడలిపోయిన ఆ ఇంట్లోని పదకొండేళ్ల చిన్నారి పోలీసులకు ఫోన్ చేసి.. జరిగింది చెప్పింది. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే పదకొండేళ్ల బాలిక కూడా కాల్చి చంపేసిన వైనాన్ని గుర్తించారు.

తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైనా ఆ పెద్ద వయస్కుడు కాల్పులు జరిపాడు. లక్కీగా పోలీసులకు ఏమీ కాలేదు. కానీ.. అదే పనిగా కాల్పులకు తెగబడుతున్న ఆ వ్యక్తిపైనా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతడు మరణించినట్లు గుర్తించారు. కుక్క కోసం అంత ఆరాచకం చేయాల్సిన అవసరం ఉందా? అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
× RELATED ఫేస్ బుక్ తాజా నిర్ణయం..వచ్చే జులై వరకు వర్క్ ఫ్రం హోం!
×