హాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన లోఫర్ భామ.. కారణం అదేనట!!

'లోఫర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముంబై బ్యూటీ దిశా పటాని. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో.. ప్రైవేట్ వీడియో ఆల్బమ్స్ లో మెరిసి గ్లామర్ డాల్ అనిపించుకుని పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో దిశా పెట్టే ఫోటోలు.. వీడియోల కోసం అందులో దిశా చేసే అందాల ప్రదర్శన కోసం అభిమానులు ఎగబడి చూస్తారంతే. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దిశా తాజాగా సోషల్ మీడియాలో తను ఓ గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులకు విందు చేస్తుంది. తెలుగులో 'లోఫర్' మూవీ తర్వాత మళ్లీ తెలుగు గడప తొక్కలేదు దిశా. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ''భాగీ 2 ఎంఎస్ ధోని మలంగ్'' సినిమాలు చేసి బీ-టౌన్ ప్రేక్షకులను తన వలలో వేసుకుంది. ఇక ఇటీవలే సల్మాన్ ఖాన్ జోడీగా 'భారత్' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అలరించి మంచి హిట్ అందుకుంది.

ప్రస్తుతం మరోసారి సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'రాధే' సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది గుమ్మా. అయితే తాజా సమాచారం ప్రకారం.. అమ్మడు ఓ భారీ ఆఫర్ వదులుకుందట. అది కూడా హాలీవుడ్ మూవీ ఆఫర్. ఎందుకో తెలియదు గాని నేను బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పాగా వేయాలని చూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అమ్మడి కెరీర్లో ఇప్పటివరకు సక్సెస్ రేట్ అంతంత మాత్రంగానే ఉంది. మరి హాలీవుడ్ మూవీలో మెయిన్ రోల్ వదులుకుందంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఈ వార్త తెలిసి దిశా అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల మీద భారీ ఆశలే పెట్టుకుంది దిశా. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఇక్కడే తేల్చుకుంటా అంటూ వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతోంది. మరి త్వరలోనే దిశా డ్రీమ్ సక్సెస్ అయి బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ అవుతుందేమో చూడాలని సినీవర్గాల టాక్.
× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×