ఈఎస్ఐ స్కాం: ఏసీబీ అదుపులో మాజీ మంత్రి పితాని పీఎస్

ఈఎస్ఐ స్కాంలో మరొకరిని ఏసీబీ ఈరోజు అదుపులోకి తీసుకుంది. మాజీ మంత్రి టీడీపీ నేత పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీ మోహన్ ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
సచివాలయంలో ఇవాళ విధుల్లో ఉన్న మురళీ మోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని కుమారుడు మాజీ పీఎస్ మురళీ మోహన్ ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ తాజాగా  మురళీ మోహన్ ను అదుపులోకి తీసుకుంది.

కాగా నిన్ననే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి  పితాని వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా పనిచేసిన మురళి మోహన్ కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. ఇంతలోనే మాజీ పీఎస్ ను ఏసీబీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ మాజీ మంత్రి.. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయనకు బెయిల్ కూడా ఇంతవరకు రాలేదు. ఆ అరెస్టు చేసిన తరువాత ఈ కేసులో మరో మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అచ్చెన్నాయుడు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా   పితాని సత్యనారాయణ పనిచేశారు. దీంతో  ఈ కుంభకోణంలో పితాని పీఎస్ అరెస్ట్ కావడం టీడీపీ శిబిరంలో ఆందోళనకు కారణమైంది.
× RELATED ఫేస్ బుక్ తాజా నిర్ణయం..వచ్చే జులై వరకు వర్క్ ఫ్రం హోం!
×