750 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం..జాతికి అంకితమిచ్చిన మోడీ!

దేశంలోనే అతిపెద్ద  సోలార్ పవర్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్ లోని రేవాలో తాజాగా నిర్మించారు. ఈ అతి పెద్ద సోలార్ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆ అవకాసం లేకపోవడంతో  ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ  750 మెగావాట్ల అతిపెద్ద  సోలార్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఈ అతిపెద్ద  సోలార్ విద్యుత్తు ప్లాంట్ ను జారీకి అంకితం చేస్తున్నట్టుగా మోడీ తెలిపారు.

ఈ పవర్ ప్లాంట్ మొత్తం 1590 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని వల్ల ప్రతి ఏడాది వాతావరణంలో కలిసే 15 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. అందువల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2022 వరకు 175 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీయే లక్ష్యంగా పనిచేస్తోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన తాజా పవర్ ప్లాంట్ నాణ్యమైన విద్యుత్ను అందివ్వనుంది.

ఈ  సోలార్ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ..  సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న మొదటి 5 దేశాల్లో భారత్ కూడా  ఒకటి అని సోలార్ విద్యుత్తు ఇప్పటికే కాదు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చేది. ఎందుకంటే సోలార్ విద్యుత్తు ఖచ్చితమైనది స్వచ్ఛమైనది భద్రమైనదని తెలిపారు. వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ లక్ష్యంగా ప్రపంచం పనిచేయాలన్నారు. రేవాలో ఉన్న ఈ అతి పెద్ద  సోలార్ పవర్ ప్లాంట్ స్థానిక పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ  తెలిపారు.
× RELATED ఫేస్ బుక్ తాజా నిర్ణయం..వచ్చే జులై వరకు వర్క్ ఫ్రం హోం!
×