వర్కౌట్స్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసిన రామ్ చరణ్...!

కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే హీరోలు దొరికిన టైమ్ ను పూర్తిగా ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్నాం కదా అని ఫిట్నెస్ ని నెగ్లెక్ట్ చేయకుండా భారీ వర్కౌట్స్ చేస్తూ బాడీ షేప్ పై స్పెషల్ కేర్ తీసుకుంటూ వస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉన్న చరణ్ ఈ రోజు ఓ ఆసక్తికర పోస్ట్ అభిమానులతో పంచుకున్నారు. తన వర్కౌట్స్ సంబంధించి ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చరణ్ ''(బుర్ర) మెదడు జిమ్ చేయమంటోంది.. హృదయం మాత్రం హ్మ్మ్ అంటూ ఆలోచిస్తోంది'' అంటూ సందేశం పోస్ట్ చేశారు. శ్రమ వలన జిమ్ వద్దనిపిస్తున్నా ఫిట్ గా ఉండాలంటే వర్కౌట్స్ తప్పదని అర్థంలో రామ్ చరణ్ ఆ ట్వీట్ చేసి ఉంటారని.. జిమ్ విషయంలో తన మానసిక సంఘర్షణ గురించి చెప్తున్నట్లున్నాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుండి కూడా తన బాడీ ఫిట్నెస్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ వస్తున్నారు. తన సినిమాల్లో కూడా తన శరీర సౌష్టవాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక చరణ్ లేటెస్టుగా నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం సాలిడ్ బాడీ మైంటైన్ చేస్తున్నారు. అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా 'ఆర్.ఆర్.ఆర్'లో చరణ్ సిక్స్ ఫ్యాక్ తో అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఇంట్రో వీడియోలో గ్రాండ్ ఎలివేషన్స్ షాట్స్ అండ్ భారీ విజువల్స్ తో పాటు చరణ్ యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ హోమ్ బ్యానర్ లో చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో రూపొందువుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Head say gym

× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×