పెళ్లాడినా ఆడకపోయినా.. రేణు అదే నిట్టూర్పు!

పవన్ కల్యాణ్ ని ప్రేమించి పెళ్లాడిన రేణు కొన్నాళ్లకు విడాకులతో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాకాలానికి రెండో పెళ్లి గురించిన ముచ్చట టాలీవుడ్ లో వేడెక్కిస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై వెలిగేందుకు సిద్ధమైన రేణు రెగ్యులర్ గా మీడియాకి టచ్ లో ఉండడంతో అక్కడ ప్రశ్నలన్నీ రెండో పెళ్లి చుట్టూనే. ఇన్ స్టా.. యూట్యూబ్ సహా పలు ప్రయివేటు చానెళ్లు ఇదే ప్రశ్నతో విసిగిస్తున్నాయి. ఇక అభిమానుల్లోనూ రేణు రెండో పెళ్లిపై అంతే ఆసక్తి. పవన్ అభిమానుల్లో కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నా.. చాలా మంది సపోర్టుగా నిలిచేవాళ్లు ఉన్నారు.

అయితే తనకు ఆ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ దాటవేసేందుకు ఆమె నానా ప్రయాసలు పడుతున్నారు. మొన్నటికి మొన్న ఇన్ స్టా ప్రశ్నావళి సెషన్స్ లో ఏదోలా ఆ ప్రశ్నకు జవాబివ్వకుండా దాటవేశారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో ఇదే తిరకాసు ప్రశ్న ఎదురైంది. అయినా నా పెళ్లిపై మీకెందుకంత ఆసక్తి వదిలేయండి! అన్నట్టే రేణు ఎక్స్ ప్రెషన్ పెట్టారు.

ఇదే నా ఆన్సర్ అంటూనే రెండో పెళ్లిపై కన్ఫ్యూజన్ లో పెట్టేశారు. పెళ్లి చేసుకున్నా కష్టమే.. చేసుకోకపోయినా కష్టమే!! అంటూ కాస్త నిట్టూర్పుగానే అన్నారు. ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తే ఆన్సర్ చేస్తానంటూ మెలిక పెట్టేశారు ఆ ఇంటర్వ్యూలో.  అయినా మీరు నా పెళ్లికి వచ్చేది లేదు.. చేసేది లేదు ఎందుకింత ఆసక్తి? అంటూ యాంకర్ నే సూటిగా నిలదీశారు రేణు.

పెళ్లి ప్రశ్నలతో విసిగిపోయిన తాను ఒక సినిమా చేస్తే దానికి `పెళ్లి గోల` అనే టైటిల్ పెడతానని సరదాగా అనేశారు. అయినా నా రెండో పెళ్లిపై మీకెందుకు సందేహాలు? అవన్నీ అనవసరం.. నేను ఇప్పుడిలా చాలా సంతోషంగానే ఉన్నానని రేణు అన్నారు. మొత్తానికి ఆ ప్రశ్నకు మాత్రం సరైన ఆన్సర్ ఇవ్వకుండా మరోసారి దాటవేశారు తెలివిగా. అలాగే మహేష్- ప్రభాస్ లాంటి హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తానని అయితే వారి చిన్నప్పటి మదర్ గా మాత్రమే కనిపిస్తానని మరో మెలిక వేయడం ఆసక్తికరం. తనకు ఆఫర్ చేసే పాత్ర ఇంప్రెస్ చేస్తే నటించేందుకు సిద్ధమేనని తెలిపారు.
× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×