2020 గ్యాప్ ఫిల్ చేసేందుకు చైతూ త్రి ప్లాన్

అక్కినేని హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘లవ్‌ స్టోరీ’ విడుదలకు సిద్దంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీ తెరకెక్కింది. ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. సమ్మర్‌ లో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడినది. ఈ ఏడాదిలో లవ్‌ స్టోరీ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఆ సినిమాతో సంబంధం లేకుండా చైతూ తదుపరి చిత్రాల పనిలో పడ్డాడట. మూడు సినిమాలను చైతూ లైన్‌ లో పెట్టాడని టాక్‌.

లవ్‌ స్టోరీ చిత్రం పూర్తి అయిన కాకున్నా ఈ ఏడాది చివర్లో విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో దిల్‌ రాజు నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు కూడా చైతూ ఓకే చెప్పాడు. తాజాగా చైతూ మరో సినిమాకు ఓకే చెప్పాడని టాక్‌ వినిపిస్తుంది.

‘వి’ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చైతూ మూవీని చేయబోతున్నాడట. ఇటీవలే ఇంద్రగంటి చెప్పిన కథకు చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. మజిలీ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి వీరిద్దరి కాంబో మూవీని నిర్మించనున్నారట.

వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. విక్రమ్‌ కుమార్‌ మూవీ ఇంకా ఈ చిత్రం కూడా కేవలం మూడు నాలుగు నెలల గ్యాప్‌ లోనే విడుదల కాబోతున్నాయట. ఈ ఏడాదిలో ఒక్క మూవీని విడుదల చేయలేక పోయిన చైతూ వచ్చే ఏడాది ‘లవర్స్ ’ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు కూడా విడుదల చేసే అవకాశం ఉందనిపిస్తుంది.

× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×