వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. జాగ్రత్త ఈ రోగాలు వ్యాపించే ప్రమాదం

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా కంపెనీలు.  సంస్థలు అతి జాగ్రత్తగా కార్యకలాపాలు.. పనులు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ .. దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేస్తున్నాయి. సాధ్యమైనంత ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేయమని చెబుతున్నాయి. దీంతో చాలామంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇంట్లో ఉన్నాం కదా ఏం రోగాలు రావని నిర్లక్ష్యంగా ఉండడం ప్రమాదకరమని కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇంట్లో ఉంటే ఏ రోగాలు వస్తాయో ఓ నివేదిక చెబుతోంది. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఊబకాయం.. శరీరంలో మార్పులు తదితర చోటుచేసుకుంటాయని డైరెక్టీ అప్లై సంస్థ హెచ్చరిస్తోంది. ఒక ఫొటో విడుదల చేసింది. ఫొటోలో కనిపిస్తున్న మోడల్కు 'సుశాన్' అని పేరు పెట్టింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే 25 సంవత్సరాల వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత ఇలా మారిపోతారు అని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇంట్లో ఉండి పనులు చేస్తుంటే ఈ వ్యాధులు రావడం తథ్యమని తెలిపింది.

వచ్చే వ్యాధులు
- కంప్యూటర్ విజన్ సిండ్రోమ్
- వెన్నెముక వంగిపోవడం
- రిపిటేటివ్ టైపింగ్ స్ట్రైన్
- జుట్టు రాలిపోవడం
- కంటి కింద మచ్చలు (డార్క్ సర్కిల్స్)
- టెక్ నెక్ (మెడపై అధికభారం వెన్ను నొప్పి)
- ఇంక్రీజ్డ్ వ్రింకిల్స్ (చర్మంపై ముడతలు)
- ఊబకాయం
- చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం ( విటమిన్ డీ డీ-12 లేకపోవడం వల్ల)
- తీవ్ర ఒత్తిడి

ఈ వ్యాధులు పొంచి ఉన్నాయని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని కొన్ని సూచనలు చేసింది. చిన్నపాటి వర్కవుట్లు నడక పరుగు శారీరక శ్రమను కలిగించే పనులు చేస్తే ఇంట్లోనే నిండు ఆరోగ్యంతో ఉంటారని తెలిపింది.

కొన్ని సూచనలు

- బెడ్ పై పని చేసుకునే దురలవాటు మానుకోవాలి. ఇది మానసిక స్థితిని దెబ్బతీసింది. ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.
- ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసుకోవాలి.
- 6-8 గంటలు మాత్రమే పనికి కేటాయించండి.
- రోజులో కనీసం ఒక్క గంట అయినా ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దూరం పెట్టాలి.
- ఎక్కువ సమయాన్ని కుటుంబంతో కలిసేలా ఉండండి. ఇది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.
- ఎక్సర్సైజులు తప్పనిసరి. ఉదయం పూట చేసే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మీ శరీరానికే కాకుండా మానసికంగా కూడా ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది.
- రక్త ప్రసరణను మెరుగుపర్చడంతోపాటు మెదడును ఉత్తేజం చేస్తుంది. ముఖ్యంగా 7-8 గంటల పాటు హాయిగా నిద్రించండి.
× RELATED రెండు ముక్కలైన విమానంలో నుంచి నిప్పు రాజుకోలేదెందుకు?
×