ఏపీ ప్రభుత్వం భరోసా: వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ తేలిందా.. ఏం కాదు

మహమ్మారి వైరస్ తీవ్రస్థాయిలో విజృంభణ కొనసాగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే  పంజా విసురుతోంది. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు పెరుగుతున్నాయి. అయితే నమోదవుతున్న కేసుల్లో చాలామందికి వైరస్ లక్షణాలు ఉండడం లేదు. దీంతో వారంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. లక్షణాలు లేకపోతే ఏం కాదని ధైర్యంగా ఉండాలని సూచిస్తోంది.  

లక్షణాలు లేని వారి (అసింప్టమాటిక్) నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండడం వారిని ఆందోళనలో పడేస్తోంది. అసింప్టమాటిక్ ఉన్నవాళ్లు భయపడాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీస్ ఎక్కువగా ఉండడంతో పాజిటివ్ వచ్చినా లక్షణాలు కనిపించవని వివరిస్తున్నారు. దానివలన శరీరానికి వైరస్ ప్రభావం చూపలేకపోయిందని.. అందుకే ఎవరూ ఆందోళన చెందొద్దని సూచిస్తున్నారు.

ఆ పాజిటివ్ ఉండి లక్షణాలు లేని వారికి ఆస్పత్రి వైద్యం అవసరం లేదని.. ఇంట్లో ఉండి కోలుకోవచ్చని చెబుతున్నారు. కేవలం శ్వాసకోశ సమస్య ఉంటే తప్ప ఆస్పత్రి వైద్యం అవసరం లేదంటున్నారు. ఇంట్లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. వైరస్ సోకిన 10 రోజుల్లోపే వారి నుంచి వైరస్ ఇతరులకు సోకుతుందని.. తర్వాత బలహీనమవుతుందని వైద్యం లేకుండానే కోలుకుంటారని వివరిస్తున్నారు. లక్షణాలు లేని పాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందొద్దని కమాండ్ కంట్రోల్ సెంటర్ నోడల్ ఆఫీసర్ రాంబాబు సూచిస్తున్నారు. లక్షణాలు లేకుంటే వైరస్ నుంచి త్వరగా కోలుకుంటారని తెలిపారు.
× RELATED రెండు ముక్కలైన విమానంలో నుంచి నిప్పు రాజుకోలేదెందుకు?
×