పాకిస్తాన్ కు చైనా డ్రోన్లు: బలపడుతున్న శత్రుదేశాల బంధం

భారతదేశానికి సరిహద్దు దేశాలుగా చైనా పాకిస్తాన్లు ఉన్నాయి. ఈ రెండు దేశాలు భారతదేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటనక్కలా ఎప్పుడు సరిహద్దు వద్ద వివాదం రేపుతూ పబ్బం గడుపుకుంటున్నాయి. రెచ్చగొట్టే ధోరణిలో ఆ రెండు దేశాలు ఉన్నాయి. ఆ రెండు దేశాల మధ్య క్రమంగా బంధం బలోపేతమవుతోంది. తాజాగా పాకిస్తాన్కు చైనా రెండు డ్రోన్లను పంపిస్తోందని సమాచారం. భారత్తో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనా తన కక్షపూరిత చర్యలను కొనసాగిస్తోంది. సరిహద్దుల వద్ద ఇప్పటికే వింగ్ లూంగ్-2 ఆర్మ్డ్ డ్రోన్లను డ్రాగన్ దేశం వాడుతోంది.

ఇప్పుడు భారత్కు శత్రువుగా ఉన్న పాకిస్థాన్ కు వాటిని అందిస్తోంది. శక్తివంతమైన రెండు డ్రోన్ లను చైనా పాక్కు తరలిస్తోంది. భారత్ తో రెండు దేశాల మధ్య వివాదం ఏర్పడిన సమయంలో పాకిస్థాన్ కు డ్రోన్లను పంపడం సంచలనంగా మారింది. ఈ డ్రోన్ల సహాయంతో గాల్లో నుంచి ఉపరితలాల మీద ఉన్న లక్ష్యాలను ఛేదించే 12 మిసైళ్ల చొప్పున ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయంపై చైనా స్పందించి.. తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే డ్రోన్లను పంపిస్తున్నట్లు తెలిపింది. చైనా ఈ విధంగా మాటలు చెబుతుండగా చేతలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. అయితే కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. సరిహద్దుల వద్ద ఇప్పటికే సైన్యాన్ని మోహరించింది. చైనా కవ్వింపు చర్యలను చూసిన ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
× RELATED రెండు ముక్కలైన విమానంలో నుంచి నిప్పు రాజుకోలేదెందుకు?
×